బీర్కూరు (ప్రజా ప్రతిధ్వని) అక్టోబర్ 02
మండల కేంద్రంలో శుక్రవారం వీబీజీ-రాంజీ పథకం కింద గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి, ఉపాధి పనులపై చర్చించారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని సర్పంచ్ అరిగే ధర్మతేజ సూచించారు.
మండల కేంద్రంలో శుక్రవారం వీబీజీ-రాంజీ పథకం కింద సర్పంచ్ అరిగే ధర్మతేజ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి, ఉపాధి పనులపై చర్చించారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని సర్పంచ్ అరిగే ధర్మతేజ సూచించారు. ఉపాధి హామీని మెరుగుపరచడమే లక్ష్యమని ఆయన అన్నారు. గతంలో 100 రోజులుగా ఉన్న పనిని ఇప్పుడు 125 రోజులకు పెంచారని, తద్వారా కూలీలకు రోజుకు రూ.308 వేతనం చెల్లించవచ్చని తెలిపారు. అంతేకాకుండా, అభివృద్ధి పనుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీకి 40 నిధులు వాడుకోవచ్చని, దీనివల్ల గ్రామాభివృద్ధి మెరుగుపడుతుందని సూచించారు. కాబట్టి, గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ కూలీలకు అండగా నిలిచి, పనులు సజావుగా కొనసాగేలా చూడటం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మెహబూబ్, సెక్రెటరీ గంగారం, ఉప సర్పంచ్ పరమేష్, సొసైటీ వైస్ చైర్మన్ యామారాములు, వార్డు సభ్యులు కాజా నవాజ్ ఖాన్, మహేష్, భాస్కర్, రఘు, మధు, ఆనంద్, హైమద్, శంకర్, అగ్రికల్చర్ ఏ.ఈ మీనా, సొసైటీ సెక్రెటరీ జి శ్రీనివాస్, గ్రామస్తులు మాజీ ఎంపీపీ రఘు, అవారి గంగారం, విట్టల్, బసవరాజ్ పటేల్, శశికాంత్, బాలకృష్ణ, కుర్రి కృష్ణ, శివ కుమార్ యాదవ్, యోగేష్, మెక్క రమేష్, ఓంకార్, అశోక్, గ్రామ యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






