బీర్కూరు (ప్రజా ప్రతిధ్వని) అక్టోబర్ 30
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ సందర్భంగా పీఎం కిసాన్ 24వ విడత కింద 18,680 కోట్ల రూపాయలను 9.34 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ నిధులు రైతుల ఖాతాల్లోకి చేరాయి. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 4.47 లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు.

బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం
మండలం, భైరపూర్ రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజేష్‌తో కలిసి బీజేపీ నాయకులు పీఎం కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్, ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేష్, కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శి కొమ్మినేనీ రాజేష్, జిల్లా యువ మోర్చా కార్యదర్శి సాయిబాబా, బీజేపీ సీనియర్ నాయకులు లక్కపల్లి పొంచు గోండ, మండల ఉపఅధ్యక్షుడు హనుమాన్లు, నాయకులు పండరి, ప్రవీణ్, నాగేష్, బసోల్ల సాయిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సాయికిరణ్ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల వివక్ష చూపడం మానుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో పొలాలు ఎండిపోయి, పంట నష్టం జరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా ఢిల్లీలో ఉద్యమాలు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
పసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రైతుల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే రైతులను నట్టేట ముంచుతున్నారని, వెంటనే వారిని ఆదుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపట్టి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన హెచ్చరించారు.