ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అమెరికాలో తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కోలో ఒక కొత్త శాఖను ప్రారంభించనుంది. ఈ శాఖ డల్లాస్ఫోర్ట్వర్త్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులకు, ముఖ్యంగా భారత్కు నగదు పంపించే వినియోగదారులకు సేవలందించేందుకు సిద్ధమైంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అమెరికాలో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కోలో కొత్త శాఖను ప్రారంభించనుంది. డల్లాస్ఫోర్ట్వర్త్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులకు, ముఖ్యంగా భారత్కు నగదు పంపించే వినియోగదారులకు ఈ శాఖ సేవలు అందించనుంది. ఈ కొత్త శాఖ రుణాలు, డిపాజిట్లు, వ్యక్తిగత బ్యాంకింగ్, వ్యాపార సేవలు వంటి సదుపాయాలను కల్పించనుంది. అమెరికాలో ఎస్బీఐకి ఉన్న సేవల పరిధిని పెంచడంతో పాటు అక్కడి భారతీయ సమాజానికి బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే ఈ విస్తరణ లక్ష్యంగా ఉంది.











