బీర్కూర్, 2026-11-14
బాలల దినోత్సవం సందర్భంగా బీర్కూర్ ప్రభుత్వ () గురుకుల పాఠశాలలో మొబైల్ వాడకం, జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే చెడు అలవాట్లు మరియు ఆరోగ్య సమస్యలపై బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
పోటీలలో మొదటి విజేతగా హర్షవర్ధన్, రెండవ విజేతగా సుశాంత్ రావ్ నిలిచారు. విజేతలకు మెడల్, పెన్ను, ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రస్తుత తరం పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్ల వాడకం వల్ల కంటి చూపు మందగించడం, మొబైల్ గేమ్స్ ఆడుతూ మానసికంగా ప్రభావితం కావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఆరోగ్య సమస్యలపై హెచ్చరిక
జంక్ ఫుడ్ తినడం వల్ల అపెండిక్స్ ఆపరేషన్లు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, తాను చూసిన అనుభవంతో చెబుతున్నానని అన్నారు. ప్రతి తల్లిదండ్రులకూ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి పిల్లలను జంక్ ఫుడ్, శీతల పానీయాలు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచండి అని కోరారు.
కార్యక్రమ నిర్వాహకులు
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోపీచంద్, ఉప ప్రధానోపాధ్యాయురాలు స్వరాజ్య లక్ష్మి, లయన్స్ జోన్ చైర్మన్ సితలె రమేష్, సీనియర్ లయన్ మేకల విఠల్, కిషోర్ ప్రభు దాస్, లయన్స్ రాష్ట్ర అసోసేషియన్ అధ్యక్షులు రవీందర్ జెట్టి, లయన్ భరత్, బీర్కూర్ మండల సెక్రటరీ నాగరాజు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.



