సీనియర్ జర్నలిస్ట్ యండమూరి వరప్రసాద్ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, తీరని విషాదాన్ని కలిగించింది. పత్రికా రంగంలో విశిష్ట సేవలందించిన ఆయన, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు మార్గదర్శిగా నిలిచారు.
పత్రికా రంగంలో విశిష్ట సేవలందించడమే కాకుండా, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు మార్గదర్శిగా నిలిచి, విలువలతో కూడిన ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపిన మహనీయులు వరప్రసాద్ గారు. ఆయనతో నాకున్న చిరకాల స్నేహానుబంధం మరపురానిది. ఆత్మీయ మిత్రుడైన ప్రసాద్ అన్న ఇక లేరనే వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన లేని లోటు తీర్చలేనిది.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ అపార దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. అక్షర సాక్షిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రసాద్ అన్న అమర్ రహే వినమ్ర నివాళులు.




