బీర్కూర్ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్ అరిగే ధర్మ తేజ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ప్రజల కష్టాలను తనవిగా భావిస్తూ, వారికి అండగా నిలుస్తూ నిజమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే పరమావధిగా బీర్కూర్ గ్రామ సర్పంచ్ శ్రీ అరిగే ధర్మ తేజ గారు ప్రజాసేవలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఊరిలో ప్రజలకు ఎలాంటి చిన్న ఇబ్బంది ఎదురైనా నేనున్నాను అంటూ ముందడుగు వేస్తూ, నిజమైన ప్రజా నాయకుడిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల భాజన చెరువు కట్ట వద్ద ఉన్న మోటార్ నుండి గ్రామంలోని మంచినీళ్ల ట్యాంకుకు నీటి సరఫరా సులభతరం చేసేందుకు, అలాగే గ్రామ అవసరాలకు, మంచి చెడు కార్యక్రమాలకు జి.పి () ట్యాంకర్ ద్వారా నిరంతర నీటిని అందించేందుకు నూతన పైప్లైన్ పనులను పూర్తి చేయించారు. దీనితో పాటు భాజన్ చెరువు కట్ట వద్ద ఉన్నటువంటి పెండింగ్ పనులన్నింటినీ వేగవంతం చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
సమస్య ఏదైనా... కాలనీ ఏదైనా... ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, వెంటనే స్పందించి క్షేత్రస్థాయికి చేరుకుని సమస్యను పరిష్కరించే గొప్ప మనసు మన సర్పంచ్ అరిగే ధర్మ తేజ అన్నగారిది. మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిస్తూ, బీర్కూర్ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజా సౌకర్యమే ధ్యేయంగా అహర్నిశలు కష్టపడుతున్న మన సర్పంచ్ శ్రీ అరిగే ధర్మ తేజ గారికి బీర్కూర్ గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.












