బాన్సువాడ నాయకుల వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్ముర్ లోని బాన్సువాడ నియోజకవర్గ పార్టీ యువ నాయకులు శివ కుమార్ (శివసూరి) లలిత గార్ల వివాహ వేడుకకు పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు హాజరయ్యారు.
ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ గారు కూడా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వివాహ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎలమంచలి శ్రీనివాస్, చందూర్ సర్పంచ్ మాధవ రెడ్డి, నార్ల రత్నకుమార్, జిల్లా కోఆర్డినేటర్ ఏజాజ్, గంగప్ప, మోచి గణేష్ తదితర నాయకులు హాజరయ్యారు.
నూతన దంపతులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.


