కామారెడ్డి జిల్లా మండలంలోని అన్నారం గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించిన మహిళలు, పాటలు పాడుతూ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సర్పంచ్ కవిత పండరీ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ పోటీల్లో మొదటి, రెండో బహుమతులతో పాటు, బతుకమ్మ పాటలు పాడిన వారికి మూడో బహుమతిని కూడా అందజేశారు. బహుమతులు అందుకోవడం మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ సంస్కృతిని, మహిళల ఆత్మీయతను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ, తరతరాల సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.












