బీర్కూర్, 1 October
లయన్స్ క్లబ్ సభ్యుడు మేరు భరత్ తన కుమారుడు మోక్షిత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా బీర్కూర్ అంగన్వాడీ కేంద్రం నంబర్ 5కు ఉచిత గ్యాస్ స్టవ్ ను విరాళంగా అందించారు. న ఈ కార్యక్రమం జరిగింది.
లయన్స్ క్లబ్ సభ్యుడు మేరు భరత్ తన కుమారుడు మోక్షిత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా బీర్కూర్ అంగన్వాడీ కేంద్రం నంబర్ 5కు ఉచిత గ్యాస్ స్టవ్ ను విరాళంగా అందించారు. న ఈ కార్యక్రమం జరిగింది.
ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో చిన్నపాటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని లయన్స్ జోన్ చైర్మన్ సీతలే రమేష్ కోరారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రం సిబ్బంది లలిత, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మేత్రి కిరణ్, కార్యదర్శి గాండ్ల సాయికృష్ణా, జోన్ చైర్మన్ సీతలే రమేష్, సీనియర్ లయన్ మేకల విఠల్, లయన్ సభ్యులు మేరు భరత్, సతీష్ యాదవ్, మేరు హన్మండ్లు, భువనగిరి అనీల్ తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.