గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చెట్లూరి పెద్ద సాయిలు గారి తండ్రి, చెట్లూరి ఇబ్రహీంలు గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గత వారం రోజులుగా గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా పనిచేసిన చెట్లూరి ఇబ్రహీంలు గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చెట్లూరి పెద్ద సాయిలు గారి తండ్రి చెట్లూరి ఇబ్రహీంలు గత వారం రోజులుగా మరణించారు.
వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్ కుమార్, బాన్సువాడ ఏఎంసీ మాజీ చైర్మన్ నరసింహులు, బాన్స్ వాడ ఉపాధ్యక్షులు మన్నే చిన్న సాయిలు, పోచారం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రీ మోహన్, పోచారం గ్రామ ఉపాధ్యక్షులు పరిమళ సాయిలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపేట అంబేద్కర్ సంఘం సభ్యులు చెట్లూరి చిన్న సాయిలు, మేదరి భాను ప్రసాద్, పెయింటర్ నరసింహులు, సాయిలు లక్ష్మణ్ పాల్గొన్నారు.












